సెంచరీ వీరుడు క్రిస్ గేల్ ను కొనియాడిన షేన్ వాట్సన్

  • ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బ్యాట్స్ మ్యాన్
  • మరెన్నో టి20 సెంచరీలు సాధించగలడు
  • అందుకే అతన్ని యూనివర్స్ బాస్ అనేది
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రెండో సెంచరీ చేసిన వ్యక్తిగా షేన్ వాట్సన్ నిలిచాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన వాట్సన్ 57 బంతుల్లో 106 పరుగులు సాధించిన విషయం విదితమే. అంతకుముందు రోజే క్రిస్ గేల్ సైతం 63 బంతుల్లో 104 పరుగులు సాధించి ఈ సీజన్ లో తొలి సెంచరీ సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. మరుసటి రోజే వాట్సన్ రెండో సెంచరీ నమోదు చేశాడు. అయినప్పటికీ క్రిస్ గేల్ ను కొనియాడడం విశేషం.

‘‘క్రిస్ గేల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బ్యాట్స్ మ్యాన్. మరెన్నో టి20 సెంచరీలు సాధించగలడు. అందుకే అతన్ని యూనివర్స్ బాస్ అనేది’’ అంటూ ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ గేల్ ను మెచ్చుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో గేల్, వాట్సన్ ఇద్దరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లు. ఇక ఎంఎస్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను కూడా షేన్ వాట్సన్ మెచ్చుకున్నాడు. వారిద్దరూ కలసి సామర్థ్యం మేరకు రాణించే ఆటగాళ్లతో మంచి జట్టు (చెన్నై సూపర్ కింగ్స్) కూర్పును రూపొందించారని అన్నాడు.
Go Back to Shorts
chris gayle
shane watson

More Telugu News